Brahmamudi : శ్రీనుని కిడ్నాప్ చేపించింది యామిని.. టెన్షన్ లో రాజ్, కావ్య!
on Jul 16, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -774 లో.... రేవతి దగ్గరికి ఇందిరాదేవి వెళ్లి డబ్బు ఇస్తుంది. నాకు కావల్సింది ఇది కాదు నానమ్మ.. ఆ కుటుంబంతో బంధం కావాలని రేవతి అంటుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ అప్పటివరకు ఈ డబ్బు తీసుకోమని ఇందిరాదేవి అంటుంది. నన్ను ఉన్నంతలో హ్యాపీగా చూసుకుంటున్నాడు.. వద్దు నానమ్మ అని రేవతి అంటుంది. మా అమ్మ ఎప్పుడు నా కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతుందోనని రేవతి బాధపడుతుంది.
మరొకవైపు అపర్ణ కార్ డోర్ తీస్తుంటే ఒక అబ్బాయి కింద పడిపోతాడు. దాంతో అతని చేతిలోని ఐస్ క్రీమ్ కిందపడిపోతుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు రేవతి కొడుకు. అయ్యో బాబు అని అపర్ణ ఆ బాబుని దగ్గరికి తీసుకొని.. నీకు ఐస్ క్రీమ్ కి డబ్బు ఇస్తానని అంటుంది. వద్దు నాకు ఐస్ క్రీమ్ మీరే కోనివ్వండి అని ఆ బాబు అనగానే అపర్ణ సరేనంటుంది. నీ పేరు ఏంటని అపర్ణ అడుగగా. స్వరాజ్ అని ఆ బాబు చెప్తాడు. నా కొడుకు పేరే అని అపర్ణ మురిసిపోయి ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఇక నుండి మనిద్దరం ఫ్రెండ్స్ అని అపర్ణ అంటుంది. సరే అని ఆ బాబు అంటాడు. మరొకవైపు ఇందిరాదేవి ఇంటికి వెళ్ళబోతుంటే అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. రేవతి ఇంటి డోర్ కొడతారు. దాంతో ఇందిరాదేవి లోపల దాక్కుంటుంది.
ఏంటి ఇలా వచ్చారని రేవతి అడుగగా.. శ్రీను అనే అతని అడ్రెస్ కావాలని కావ్య చూపించగా ఇంటిపక్కనే అని రేవతి తీసుకొని వెళ్తుంది. శ్రీను వాళ్ల అమ్మని బయటకి పిలుస్తుంది రేవతి. కావ్య జరిగింది చెప్తుంది. నా కొడుకు అలా చేసాడంటే నేను నమ్మలేకపోతున్నానని శ్రీనుకి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. శ్రీను దగ్గర ఫోన్ ఇంకొక రౌడీ తీసుకొని మీ కొడుకుని కిడ్నాప్ చేశామని రౌడీ చెప్తాడు. అలా అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇందిరాదేవి వెళ్తుంటే అక్కడే ఉన్న రాజ్ చూసి నానమ్మ అంటాడు. తరువాయి భాగంలో శ్రీనుని కిడ్నాప్ చేయిస్తుంది యామిని. ఆ కిడ్నాప్ చేసింది కూడా అప్పునే అని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది యామిని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



